వెల్లుల్లిలో ఏముంటుంది?
|
కారంపొడి నిల్వ చేసిన డబ్బాలో చిన్న ఇంగువ ముక్క ఉంచితే పురుగు పట్టకుండా ఎక్కువ కాలం ఉంటుంది.
బాగా పండిన టమాటాలు పగిలిపోకుండా ఉండాలంటే
బాగా పండిన టమాటాలు పగిలిపోకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళలో వెయ్యండి.
వెండి సామాగ్రి మురికి పోవాలంటే
నీళ్ళలో కాసిని పచ్చి పాలు కలిపి వెండి సామాగ్రి కడిగితే మురికి సులువుగా వదిలిపోయి శుభ్ర పడతాయి.
గోధుమ రవ్వ పురుగు పట్టకుండా ఉండాలంటే
గోధుమ రవ్వ పురుగు పట్టకుండా ఉండాలంటే డబ్బాలో కాస్త ఉప్పును మూట కట్టి వెయ్యండి.
వెండి రంగు మారకుండా ఉండాలంటే...
వెండి సామాగ్రి బద్ర పరిచే డబ్బాలో చిన్న సుద్ధ ముక్క వెయ్యండి.అది తేమను పీలుస్తుంది. దాంతో వెండి ఎక్కువ కాలం రంగు మారకుండా ఉంటుంది. పంచదారకు చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదార డబ్బాలో రెండు లవంగాలు ఉంచితే సరి...
- తడి మసాలాను తక్కువ మంట మీద వేయీ స్తే రంగు కోల్పోకుండా రుచిగా ఉంటుంది.
- కచోరి తయారికి ఉపయోగించే పిండి లో చెంచా వేడి నూనె వేస్తె చక్కగా వస్తాయీ .
- నూడిల్స్ ను ఉడికించిన వెంటనే చల్లటి నీళ్ళలో వేస్తే అతుక్కోకుండా వేటికవి విడిగా వస్తాయ్.
- గసగసాలను పావుగంట నానబెట్టి రుబ్బితే ముద్ద మెత్త గా అవుతుంది.
- ఉడెన్ ఫర్నిచర్‌ను పేపర్‌తో తుడిస్తే పాలిష్ చేసినట్లు మెరుస్తాయి. పేపర్‌తో తుడవడం వల్ల సందుల్లోని దుమ్ము పూర్తిగా వదలదు కాబట్టి ముందుగా మెత్తటి క్లాత్‌తో తుడిచి, తర్వాత పేపర్‌తో తుడవాలి.
- కూరలో కారం ఎక్కువైతే అందులో కాస్త కొబ్బరి పాలు కలిపి చుడండి.
కరివేపాకు కాని కొత్తిమీర కాని ఎండినప్పుడు పారవేయకుండా
కరివేపాకు కాని కొత్తిమీర కాని ఎండినప్పుడు దానిని పారవేయకుండా కొద్దిగా నలిపి కూరల్లో వేసుకుంటే పచ్చి కరివేపాకు వేసుకున్నప్పటిలాగే రుచిగా ఉంటుంది.
నాననిస్తే మట్టిగడ్డలు నీళ్ళలో కరిగిపోతాయి.
2. కూరలు తరిగేటప్పుడు కత్తిపీట క్రింద పాత పేపరు వేసుకుంటే, తరిగిన తొక్కలను అలాగే పేపరుతో ఎత్తి బైట పారేయవచ్చు. లేకపోతే అనంతరం ఊడ్చుకోవడం శ్రమ, టైం వేస్టూనూ.
3. కాయగూరల్ని ముందుగా నీటిలో శుభ్రంగా కడిగి, ఆ తరువాతనే తరగాలి. అంతేగాని ముందుగా తరిగేసి,తరువాత కడగకూడదు.
4. ముందుగా కడిగినా కూడా అరటికాయ మొదలైనవాటిని తరిగి నీళ్ళలోనే వేయాలి. ఇటువంటి కూరలు రెండు సార్లు శుభ్రపడవలసిందే.
5. కూరగాయముక్కల్ని పసుపు కలిపిన నీటిలో ఉంచితే ఏవైనా క్రిములు ఉంటే అవి పైకి తేలిపోతాయి.
6. కూరలను మరీ సన్నగాను నాజూకుగానూ తరగకూడదు. అందువల్ల వాటిలోని పోషకాంశాలు నశించే ప్రమాదముంది.
7. కొన్ని కూరలు తరిగేటప్పుడు చేతులు బంకగానో, పొరలు గానో వచ్చేస్తూనో ఉంటాయి అరటి పనస వంటి కూరలు.తరిగేముందు చేతులకు కొంచెం నూనె రాసుకుని తరిగితే ఆ విధంగా జరగదు.
8. కంద పెండలం వంటివి తరిగేటప్పుడు చేతుల్ని చింతపండు రసంలో తడుపుకుంటే దురదలు పుట్టవు.
9. తరిగిన కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పు వేసి నలిపితే చేదు తగ్గుతుంది.
10. బంగాళాదుంపలు మెత్తబడినట్లయితే తరగబోయేముందు వాటిని ఒక అరగంట ఐస్ వాటర్లో ఉంచితే గట్టిపడతాయి.
11. వంకాయలు, అరటికాయలు తరిగేటప్పుడు కొంచెం పెరుగు కలిపిన నీళ్ళలోకి తరిగితే కనరెక్కకుండా ఉంటాయి.
12. వంకాయ ముక్కల్ని బియ్యం కడిగిన నీళ్ళలోకాని, ఉప్పు వేసిన నీళ్ళలో వేస్తే కనరెక్కకుండాను, నల్లబడకుండానూ ఉంటాయి.
13. అరటిపువ్వును దంపేటప్పుడు పసుపు వేసి దంపితే నల్లబడదు.
14. ఉల్లిపాయలను ఒక అరగంట సేపు నీళ్ళలో నాననిచ్చి, ఆ తర్వాత తరిగితే కళ్ళమ్మట నీళ్ళు రావు.లేదా ఫ్రిజ్లో పెట్టి తీసినా సరే.
15. కాలిఫ్లవర్ ను ఎప్పుడుగానీ చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు వేసిన గోరువెచ్చటి నీళ్ళలో వేసి కొద్ది సేపు తర్వాత తీసి వండుకోవాలి. ఇలా చేస్తే అందులోని క్రిములు చచ్చిపోతాయి.
16. ఉల్లిపాయ తరిగేటప్పుడు రెండువైపులా కోసి మధ్యకి తరిగితే పైనున్న పొర త్వరగా వచ్చేస్తుంది.
17. వెల్లుల్లికి కొద్దిగా నూనె రాసి కొద్దిసేపు ఎండలో బెడితే పొట్టు తేలిగ్గా వస్తుంది.
18. నిమ్మకాయను నేలమీద పెట్టి అరచేత్తో అదిమి కాస్త మెత్తబడ్డాక కోస్తే రసం పిండటం తేలికగా ఉంటుంది ఎక్కువ వస్తుంది కూడా.
19. పగిలిన గ్రుడ్డును కొంచెం వెనిగర్ కలిపిన నీళ్ళలో ఉడకబెడితె లోపలి ద్రవం బైటకు రాకుండా బాగా ఉడుకుతుంది.
20. గ్రుడ్లను ఉడకబెట్టిన తర్వాత వెంటనే చన్నీళ్ళలో ఉంచితే పై పెంకు ఒలవడం తేలికవుతుంది.
21. ఉడికిన గ్రుడ్లను చన్నీళ్ళలో ముంచిన కత్తితో కోస్తే బాగా తెగుతాయి.
22. కోడిగ్రుడ్లను అల్యూమినియం, లేదా వెండిపాత్రలలో పగలగొడితే అందులోని సల్ఫర్ కారణంగా పాత్రలు నల్లబడతాయి.
23. తడిగా ఉన్న పాత్రలలోకి పగలగొడితే గ్రుడ్డులోని పసుపు భాగం పాత్రకు అంటుకోకుండా ఉంటుంది.
24. ఆమ్లెట్లు వేసేముందు గిన్నెలో ఉప్పు కారం మసాలా అన్నీకలిపి కొద్దిగ నీరుపోసి కలిపిన తర్వాత గ్రుడ్లను కొట్టి కలిపితే అవి సమానంగా కలుస్తాయి.
![[cardamoms1.jpg]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhh0RaW-XIe2euey6tERF-TjeIgjCDXH6WRH2ubmB58yMZavqdvtbNiJRmHzmR3mH5qsz9DMEZsflqO4naOvAIY6bCFPjYPQCKgsqtlJRNwzH2tT_vrfJGDs9nYuWm5PQEvReoqX9IUbTcg/s200/cardamoms1.jpg)
![[cardamom+plant.jpg]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgwRrmSQpDAHxyE6YDfUqtQlbt28cEhyphenhyphensvKxc3OaQZMrJ6DHj1jJTAcwcMFou7nqSJ3MRP_CJn0YqxaIbbMVs-tDh48ITVq1IGZmC1gj7vlRWkAUBjMdNyeUicC6g3YBhZHbMKFye4757lA/s200/cardamom+plant.jpg)
![[cardamom+plant1.jpg]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhV6T67LqTpQK_nD5r2-u6Yj0t6LU_UXmAPNrE1oOmqYfCmpvGlr_IZB0xDh23_BzNAsWqou1BM2hhalajhpgTLp31dNlF0mVBtPPbmJdjN6RAa6xljjOnF-puLsbsMuoLtZMeHuZe5-RIJ/s200/cardamom+plant1.jpg)
యాలకులకు విశేష ఔషధగుణాలున్నాయి. జీర్ణవ్యవస్థకు మేలు చేసే లక్షణం వీటికి ఉంది. నోటి దుర్వాసన, అజీర్ణం, వాంతులకు విరుగుడుగా వాడతారు. పిత్తాశయం, పేగులో ఇబ్బందులకు, కడుపునొప్పి తగ్గడానికి ఉపకరిస్తాయి.యాలకులనూనె కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. తలతిరుగుడు వాంతులకు విరుగుడుగా పనిచేస్తుంది.దగ్గు, గొంతులోని భాధలకు ఉపశమన. పిల్లలకు వచ్చే కడుపునొప్పి అజీర్ణానికి వాముతో పాటు యాలకులు కలిపి వాడతారు.యాలకుల సువాసన ఆహారపదార్థాలను బాగా తినేలా చేస్తాయి. అలా తిన్న ఆహారాన్ని యాలకులు త్వరగా జీర్ణం చేస్తాయి. ఆరోగ్యదాయకమైన యాలకుల ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది.యాలకుల మొక్క బెరడును తాజాగా తీసి నోటిలో వేసుకుని నమలితే కదిలిన పండ్లకు తిరిగి పట్టు వస్తుంది. దంతాలలో రక్తస్రావం ఆగిపోతుంది. బలపడతాయి. మొక్క బెరడుతో తీసిన కషాయం సైంధవలవణంతో కలిపి పుక్కిలిస్తే టాన్సిలైటిస్ తగ్గుతుంది.
మందార, గోరింట, మునగ, కలబంద, తులసి... ఇవేమీ ఔషధ మొక్కలు కాదు. వాటిని ప్రత్యేకంగా చూడాల్సిన, పెంచడంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. తమలపాకు మినహా మన పెరట్లో మామూలుగానే పెరుగుతాయి. అయితే... మనకు ఆరోగ్యం ఇచ్చే విషయంలో అవేమీ లోటు చేయవు.మామూలు పెరటి చెట్లే అయినా అవి మనకు చేసే మేలు, సమకూర్చే ఆరోగ్య వివరాలను తెలుసుకుందాం... రండి.
మన దైనందిన జీవితంలో మనకు అనునిత్యం తారసపడే అనేక చిన్న, పెద్ద మొక్కల్లో ఎన్నెన్నో ఔషధ విలువలు ఉన్నాయి. వీటి ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో, అనారోగ్యాన్ని ఎలా నయం చేసుకోవచ్చో... ఆయుర్వేదం చక్కగా వివరించింది. వీటిపై కాస్త అవగాహన పెంచుకుంటే చీటికీమాటికీ డాక్టర్ల వద్దకు పరుగులు తీయాల్సిన అవసరమే ఉండదు. వృక్షో రక్షతి రక్షితః అన్న ఆర్యోక్తికి అద్దం పట్టే విధంగా కొన్ని ఉదాహరణలు మీకోసం...
