షడ్రుచులు


కంది పచ్చడి 

బిస్కట్లు

కావలసిన వస్తువులు:
మైదా - 1 కప్పు  బొంబాయి రవ్వ - 1/2 కప్పు  చక్కర - 1/2 కప్పు   నెయ్యి - 2-3 tsp
        ముందుగా రవ్వ, మైదా, నెయ్యి వేసి బాగా కలపాలి. తగుమాత్రం నీళ్ళలో చక్కెరను కరిగించి ఆ నీళ్ళతో ఈ మిస్రమాని చపాతీ పిండిలా కలుపుకోవాలి. కనీసం రెండు గంటలు నానినతర్వాట బాగా మర్దన చేసి , చపాతీలా వత్తుకుని, చిన్న మూతతో బిళ్లలుగా కోసి నేతిలో లేదానూనెలో గోదుమవర్ణం వచ్చేవరకు నిదానంగా వేయించుకోవాలి. ఇవి రుచిగా, కరకరలాడుతూ ఉంటాయి. తీపి వద్దు అనుకుంటే ఉప్పు, కారం వేసి కూడా చేసుకోవచ్చు.

కావలసిన వస్తువులు:

కందిపప్పు - 100 gms   ఎండుమిరపకాయలు - 6   జీలకర్ర - 1tsp   ధనియాలు - 1 tsp  నెయ్యి - 1 tsp   నూనె - tbsp  కరివేపాకు - 1రెబ్బ     చింతపండు - నిమ్మకాయంత
        ముందుగా నెయ్యి వేడి చేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేయించి తీసి పక్కన పెట్టి, ఆ తరవాత కంది పప్పును దోరగా కమ్మని వాసన వచ్చేవరకు వేయించి మిగతా వస్తువులతో కలిపి తగినంత ఉప్పు వేసి కొద్దిగా నెలలు చల్లుకుంటూ ముద్దగా రుబ్బుకోవాలి. తర్వాత నూనె వేడి చేసి పోపు గింజలు, కరివేపాకు వేసి చిటపటలాడాక పచ్చడిలో కలపాలి. ఇది వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుంది

టొమాటో పచ్చడి

కావలసిన వస్తువులు:
టొమాటోలు - ఆరు   ఉల్లిపాయలు - రెండు   ఉప్పు - తగినంత   కారం - అర స్పూన్   పసుపు - చిటికెడు   అల్లం వెల్లుల్లి - ఒక స్పూన్   ఆవాలు - పావు స్పూన్ జీలకర్ర - అర స్పూన్   కరివేపాకు - ఒక రెబ్బ   నూనె - రెండు స్పూన్లు
    టొమాటోలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు రుబ్బిన ముద్ద వేసి పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలియబెట్టి నిదానంగా నూనె
తేలేవరకు ఉడికించాలి.

మసాలా వడ

కావలసిన వస్తువులు:

సెనగపప్పు 200 gms  ఉల్లిపాయ 1   పచ్చిమిర్చి 4  అల్లం 1 "ముక్క
కరివేపాకు 2 రెబ్బలు  తోటకూర 1కప్పు  ఉప్పు తగినంత   జీలకర్ర 1 tsp  నూనె వేయించడానికి.
          సెనగపప్పు శుభ్రం చేసుకుని నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత నీరంతా పోయేలా వడగట్టాలి. తడి ఉండకూడదు. పప్పులో కొంచం తీసి పక్కన పెట్టుకొని సగం పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. మిగతా పప్పు చేర్చి బరకగా రుబ్బుకోవాలి. ఇదంతా ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆకుకూర, ఉప్పు, జీలకర్ర, సెనగపప్పు వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు నూనె వేడి చేసి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకుని కాస్త మందంగా వెడల్పుగా వత్తుకుని నిదానంగా ఎర్రగా అయ్యేవరకు వేయించాలి. పుదీనా లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి.




నమక్ పేడాలు

కావలసిన వస్తువులు:
మైదా - 1/2 kg   ఉప్పు - రుచికి తగినంత   నూనె - వేయించడానికి    వాము - 1 tsp      పసుపు - చిటికెడు    వంటసోడా - చిటికెడు   నెయ్యి - 2 tbsp
      మైదా, వాము, ఉప్పు, నెయ్యి, వంటసోడా వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళు పోస్తూ మృదువుగా చపాతీ పిండిలా తడిపి తడిగుడ్డ కప్పు అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెద్ద సైజు నిమ్మకాయంత ఉండలు చేసుకుని కాస్త మందపాటి చపాతీల్లా ఒత్తుకోవాలి. చాకుతో చపాతీని డైమండ్ కాని పట్టీలుగా కాని కట్ చేసుకుని వేడి నూనెలో నిదానంగా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇవి వారం పాటు నిలవ ఉంటాయి.

కంచి ఇడ్లీ

కావలసిన వస్తువులు:
మినప్పప్పు 1 గ్లాసు  ఇడ్లీ రవ్వ 2 1/2 గ్లస్సులు  ఉప్పు తగినంత ఆవాలు 1/2 tsp  జీలకర్ర 1/2 tsp   మినప్పప్పు 2 tsp   శనగపప్పు 3 tsp   పచ్చిమిర్చి 3  కరివేపాకు 1 tsp  నూనె 5 tsp
        ముందుగా పప్పు, రవ్వను బాగు చేసుకుని నీళ్ళు పోసి నానబెట్టిపప్పును మెత్తగా రుబ్బు కోవాలి.  రవ్వలో నీళ్ళు పిండేసి అందులొ వేసి తగినంత ఉప్పు వేసి కలిపి ఆరు గంటలపాటు ఉంచేయాలి.శనగపప్పు గంట  నానబెట్టి పిండిలో కలపాలి. నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి,కరివేపాకు, మినప్పప్పువేసి వేగిన తర్వాత ఈ రుబ్బిన పిండిలో వేసి కలిపి ఇడ్లీలు చేసుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది.

మైసూరు ఉప్మా

కావలసిన వస్తువులు:

ఇడ్లీలు 8  వేరుశనక్కాయలు 50 gm  ఆవలు 1/2 tsp  జీలకర్ర 1 tsp   మినప్పప్పు 1 tsp  శనగపప్పు 2 tsp  ఎండుమిర్చి 2   అల్లం 1''  'పసుపు కొద్దిగా  కొత్తిమిర 2 tsp    కరివేపాకు 1 tsp   నిమ్మరసం 1 tsp  ఉప్పు తగినంత   నూనె 3 tbsp
          ఇడ్లీలను మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక మినప్పప్పు, శనగపప్పు,వేరుశనగ గుళ్ళు,కరివేపాకు పసుపు వేసి కొద్దిగా వేపాకా పేయాలి.ఇప్పుడు ఇందులో ఇడ్లీపొడిని,తగినంత ఉప్పు కొద్దిగా  నిమ్మరసం,కొత్తిమిర వేసి బాగా కలిపి కొత్తిమిర చట్నీతో వడ్డించాలి.

ఇడ్లీ తీపి పొంగలి

కావలసిన వస్తువులు:     ఇడ్లీలు 4   బెల్లం సరిపడ   యాలకులు 3    జీడిపప్పు 5   కిస్మిస్ 5    నెయ్యి 2 tsp
ఇడ్లీలను చిదిమి పెట్టుకోవాలి.బాణలిలో కొంచెం నెయ్యి వేడి చేసి కిస్మిస్,  జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తురిమిన బెల్లం కొద్దిగా  నీరు కలిపి బాణలిలో వేసి సన్న మంట మీద ఉంచాలి. పై పాకంలో ఇడ్లీ పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. బెల్లం అంతా కరిగేవరకు ఇలా కలిపి దించేయాలి. కిస్మిస్, జీడిపప్పు కలిపి వేడిగా వడ్డించాలి. ఇది పూర్తిగా సన్నని మంటపైనే చేయాలి.


పులిహొర

కావలసిన వస్తువులు:
బియ్యం 100 gm  చింతపండు 50 gm   పసుపు 1 tsp   ఎండు మిర్చి 4  ఆవాలు 1 tsp  జీలకర్ర 1/2tsp  మినప్పప్పు 1 tsp  శనగపప్పు 2 tsp  వేరుశన గుళ్ళు 1/4 కప్పు  కరివేపాకు 2 రెబ్బలు  ఇంగువ చిటికెడు   నూనె 4 tbsp  ఉప్పు తగినంత
      అన్నం వండి చల్లార్చి పెట్టాలి. చింతపండును అర కప్పు నీళ్ళు పోసి నాన పెట్టి చిక్కటి పులుసు తీసి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసిముందుగా ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడాక మినపప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు పసుపు వేసి వేయించి పులుసు పోయాలి. తగినంత ఉప్పు కొద్దిగా బెల్లం కాని చక్కెర కాని వేసి మరిగించాలి. పులుసు చిక్కబడి నూనె తేలగానే దింపేయాలి. కాస్త చల్లారిన తర్వాత అన్నంలో వేసి బాగా కలిపి ఓ పది నిమిషాలు అలాగే మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు తినడానికి రేడి. పులుసు ఎక్కువ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుని కావల్సినప్పుడు అన్నం వండి కలుపు కోవచ్చు.





కొబ్బరి కారం
కావలసిన వస్తువులు:
ఎండుకొబ్బరి చిప్పలు 2 ఎండుమిర్చి 10 ధనియాలు అర కప్పు వెల్లుల్లి 20 రేకలు
జీలకర్ర 4 tsp కర్వేపాకు 5 రెబ్బలు ఉప్పు తగినంత పసుపు 1/2 tsp నెయ్యి2 tsp
      బాణలిలో నెయ్యి వేడి చేసి ఎండు కొబ్బరి ముక్కలు దోరగా వేయించి పక్కన ఉంచాలి. తర్వాత ధనియాలు, మిర్చి, కర్వేపాకు, జీలకర్ర కూడా విడివిడిగా వేయించి చల్లారిన తర్వాత వాటికి వెల్లుల్లి ఉప్పు జత చేసి మెత్తగా మిక్సీలో పొడి చేసుకోవాలి.

ధనియాల పొడి
కావలసిన వస్తువులు:
ధనియాలు 100 gm ఎండుమిర్చి 50 gm మినపప్పు 25 gm ఆవాలు 1 gm  వేరుసెనగపప్పు 25 gm  సెనగపప్పు 25 gm చింతపండు అర నిమ్మపండంత  నూనె 4 tbsp ఉప్పు తగినంత
     బాణలిలో నూనే వేడి చేసి ఎండుమిర్చి, పప్పులు, ఆవాలు, చింతపండురెక్కలు విడివిడిగా వేపాలి.చల్లారిన తర్వాత ఉప్పు వేసి పొడి చేసుకోవాలి.
కొత్తిమీర పొడి
కావలసిన వస్తువులు:
కొత్తిమీర4కట్టలు జీలకర్ర2tsp మినపప్పు2tsp చింతపండు నిమ్మకాయంత
పసుపు 1/4 tsp ఉప్పు తగినంత ఎండుమిరపకాయలు 6 మెంతులు 1/4 tsp వెల్లుల్లి 6 రేకలు
     కొత్తిమీర కట్టలు చివర కాడలు కట్ చేసి నీటిలో శుభ్రంగా చేసి పొడి బట్ట మీద నీడలో బాగా ఆరనివ్వాలి.బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు,  చింతపండు రెక్కలు విడివిడిగా వేపి చల్లారనివ్వాలి.వీటికిఆరినకొత్తిమీర, ఉప్పు, పసుపు, వెల్లుల్లి జత చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. వెడల్పాటి బాణలిలో కాస్త నెయ్యి వేడి చేసి ఈ పొడిని నిదానంగా తడిలేకుండా వేపి చల్లరినతరవాత సీసాలో వేసి ఉంచుకోవాలి.
కారప్పొడి
కావలసిన వస్తువులు:
ఎండుమిరపకాయలు 1 కప్పు ధనియాలు 1 కప్పు మినపప్పు 1 కప్పు కర్వేపాకు 1 కప్పు వెల్లుల్లి 10 జీలకర్ర 2 చెంచాలు మెంతులు 2 చెంచాలు ఆవాలు 1 చెంచా చింతపండు నిమ్మకాయంత నూనె 1/4 కప్పు  పసుపు 1 tsp  ఉప్ప్పు తగినంత.
    బండీలో నూనె వేసి ఎండుమిరపకాయలు,ధనియాలు, మినపప్పు, కర్వేపాకు, మెంతులు, ఆవాలు చివరగా జీలకర్ర, వెల్లుల్లి వేపి తీయాలి. చల్లారిన తర్వాత వీటన్నింటికి ఉప్పు పసుపు కలిపి మిక్సీలో వేసి చ్వరగా చింతపండు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ఈ పొడిని మళ్ళీ ఓసారి తడిలేకుండా వేయించుకుని నిల్వ చేసుకుంటే సరి.

కరివేపాకు పొడి

కావలసిన వస్తువులు:  కరివేపాకు 1 కప్పు  ఎండుమిర్చి 4  జీలకర్ర 1 tsp  ధనియాలు 2 tsp
మినప్పప్పు 2 tsp  శనగపప్పు 2 tsp వేరుశనగగుళ్ళు 4 tsp తురిమిన పచ్చికొబ్బరి 1/4 కప్పు
నెయ్యి 2 tsp  వెల్లుల్లి 5  చింతపండు 4 రెక్కలు  ఉప్పు తగినంత  నూనె 1 tsp
   ముందుగా కరివేపాకును కడిగి ఆరబెట్టాలి. నూనెవేడిచేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లులి రెబ్బలు, వేరుశనగగుళ్ళు, పప్పులు, చింతపండు అన్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కరివేపాకు కూడా కరకర లాడేలా వేయించాలి. ఇవన్ని కలిపి తగినంత ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. తర్వాత బాణలిలో నెయ్యి వేడి చేసి ఈ పొడి, కొబ్బరి పొడి అన్ని కలిపి తడి ఆరిపోయి పొడి పొడిగా అయ్యేదాకా వేయించి దింపేయాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వేడి
అన్నంలో మొదటి   నాలుగు ముద్దలు ఈ పొడి వేసుకు తింటే ఆకలి పెరుగుతుంది. చపాతీ బ్రెడ్ మీద కూడా వేసి తినొచ్చు.

పొదీనా పొడి

కావలసిన వస్తువులు:
పుదీనా ఆకులు 2 కప్పులు మినపప్పు 1 కప్పు ఎండుమిరపకాయలు 8
వేరుశనగపప్పు 1 కప్పు జీలకర్ర 4 చెంచాలు శనగపప్పు 1 కప్పు వెల్లుల్లి 12 రేకలు ఉప్పు తగినంత నూనె 1 tsp నెయ్యి 3 tsp
         పుదీనా ఆకులను కడిగి శుభ్రపరచి నీడలో ఆరనిచ్చి తడి లేకుండా చూసుకోవాలి.ఒక చెంచా నూనె వేసి పప్పులన్నింటినీ విడి విడిగా వేపుకోవాలి.చివరలో జీలకర్ర,ఎండుమిర్చి తర్వాత పుదీనా ఆకులు కూడా తడి పోయేలా వేపాలి. చల్లారిన తర్వాత ఉప్పు వెల్లుల్లి వేపిన పదార్థాలన్నీ వేసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. పొయ్యి మీద వెడల్పాటి బాణలి పెట్టి నెయ్యి వేడి చేసి ఈ పొడిని మళ్ళి ఓ సారి తడి లేకుండా నిదానంగా వేపి డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. తగినంత ఉప్పు ఉండి తడిలేకుండా ఉంటే ఈ పొడి కనీసం నెలరోజులు నిల్వ ఉంటుంది.

చింతచిగురు పొడి

కావలసిన వస్తువులు:  చింత చిగురు 100 gm ధనియాలు 100 gm ఎండుమిర్చి 5 వెల్లుల్లి 5 రేకలు నూనె 1/4 కప్పు
           చింతచిగురుని నలిపి పుల్లలు లేకుండా శుభ్రపరచాలి. బాండీలో నూనే వేడి చేసి విడివిడిగా ఎండుమిర్చి, ధనియాలు, కర్వేపాకు, వెల్లుల్లి చివరలో చింతచిగురు కూడా వేసి వేగనిచ్చి తీసి చల్లారనివ్వాలి. మొత్తం మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పులుపు సరిపోకుంటే కాస్త చింతపండు రెక్కలు వేపి ఇందులో కలిపి పొడి చేసుకోవచ్చు.


పచ్చిమిరపకాయ కూర
కవలసిన పదార్దాలు: పచ్చిమిరపకాయలు వంద గ్రాములు, శనగపిండి 3 స్పూనులు,  నూనె  1/4కిలొ, తాలింపుగింజలు  2స్పూనులు,  ఉల్లిపాయలు  1/4కిలొ,  ఉప్పు  తగినంత,  కరివేపాకు  2రెబ్బలు
        పచ్చిమిరపకాయలు సన్నగా నిలువుగా చీలికలు చేయాలి. ఉల్లిపాయలు కూడ సన్నగా నిలువుగా చీలికలు చేయాలి. కరివేపాకు కూడ సన్నగా చిన్నగా తరగాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరువాత తలింపు వేసి తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. శనగపిండి ఉప్పు, జీలకర్ర గరిట జారుగా నీళ్ళలో కలిపి ముక్కలలో పోసి అడుగంటకుండా పొడి పొడిగా అయిన తరువాత దించాలి.

మామిడి కాయ చారు
పచ్చి మామిడికాయ 1 ఎండు మిరపకాయలు 3  ఆవాలు 1/4 tsp  జీలకర్ర 1/4 tsp  ఇంగువ చిటికెడు  పసుపు చిటికెడు  ఉప్పు తగినంత కరివేపాకు 1 tsp  కొత్తిమిర 2 tsp  చక్కెర 1 tsp  నూనె 3 tsp
       పచ్చి మామిడికాయను ముక్కలుగా కోసి ఉడికించి గుజ్జు తీసుకోవాలి.ఇందులో కావల్సినంత నీరు కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి ఇంగువ వేసి,  ఎందుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక మామిడి గుజ్జు కలిపిన నీరు పొసి అందులో పసుపు, ఉప్పు, కరివేపాకు,కొత్తిమిర, చక్కెర వేసి బాగా మరిగించి దింపేయాలి.


వెల్లుల్లి ఊరగాయ

కవలసిన పదార్దాలు:

వెల్లుల్లి రెబ్బలు 2 cups ఉప్పు 1/2 cup కారం 1/4 cup మెంతిపొడి 3 tsp
ఆవపొడి 1/4 cup జీలకర్ర 1 tsp ఇంగువ చిటికెడు పసుపు 1 tsp నిమ్మరసం 3 tbsp నూనె
        వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి శుభ్రం చేసి కాగిన నూనెలో మగ్గ బెట్టాలి.దింపి చల్లారాక పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలియబెట్టాలి.బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఇంగువ,ఆవాలు,జీలకర్ర వేసి తాళింపు పెట్టి జాడీలో పెట్టుకోవాలి. ౩ నెలలు నిలువ ఉంటుంది.


నిమ్మరసం పచ్చడి

కావలసిన వస్తువులు:         నిమ్మరసం 250 ml  పచ్చళ్ళ కారం పొడి 25 gm  ఉప్పు 60 gm  పసుపు 1/2 tsp జీలకర్ర పొడి 1 tsp  మెంతి పొడి 1/4 tsp  ఆవ పొడి 2 tsp  నూనె 50 tsp  ఆవాలు 1/4 tsp  జీలకర్ర 1/4 tsp ఎండుమిర్చి 3  ఇంగువ చిటికెడు
            నిమ్మరసంలో ఉప్పు, కారంపొడి, పసుపు, జీలకర్రపొడి, మెంతి పొడి, ఆవ పొడి అన్ని బాగా కలిపి ఉంచుకోవాలి. నూనె వేడి చేసి ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేపి ఈ మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు ఉడికించి దింపి చల్లారాక వాడుకోవాలి. ఈ పచ్చడి మరుసటి రోజు తింటే కారం ఘాటు తగ్గుతుంది.


కొబ్బరి పచ్చడి

కావలసిన వస్తువులు:      పచ్చి కొబ్బరి 1 కప్పు   పచ్చిమిర్చి 3 పుట్నాలపప్పు 1/4 కప్పు అల్లం 1 ' ముక్క పెరుగు 1/4 కప్పు ఆవాలు 1/4 కరివేపాకు 1 రెబ్బ నూనె 2 tsp
              ఇవి అన్నీ కలిపి మెత్తగా రుబ్బి పోపు పెట్టుకోవాలి.
ఉసిరి ఆవకాయ

కావలసిన వస్తువులు: ఉసిరికాయలు 1kg నూనె 250 gm ఉప్పు 250 gm
కారం పొడి 125gm పసుపు 25gm జీలకర్ర పొడి 25gm మెంతిపొడి 10 gm
ఆవపొడి 100gm ఇంగువ చిటికెడు ఆవాలు 1tsp జీలకర్ర 1tsp మెంతులు 1/2 tsp
          ముందుగా ఉసిరికాయలను కడిగి తుడిచి వేడి నూనెలో కాస్త మెత్తపడేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఇంగువ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడాక దింపి చాలారాక కారం, పసుపు, జీలకర్ర పొడి, మెంతిపొడి, ఆవపొడి ఉసిరికాయలు అన్నీ వేసి కలిపి జాడీలో పెట్టుకోవాలి.

కొత్తిమిర పచ్చడి

కావలసిన వస్తువులు:  కొత్తిమిర 1కప్పు,చింతపండు నిమ్మకాయంత, ఎండుమిర్చి4, జీలకర్ర 2tsp,ధనియాలు 2tsp, మినపప్పు 1tsp, శనగపప్పు 1tsp
నూనె 3 tbsp కరివేపాకు 2 రెబ్బలు ఉప్పు తగినంత
         కొత్తిమిర కడిగి సన్నగా తరిగి ఒక చెంచాడు నూనెలో కొద్దిగా వేపి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, పప్పులు వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇందులో కొత్తిమిర, చింతపండు ఉప్పు కలిపి మళ్లీ మెత్తగా రుబ్బి పోపు పెట్టాలి.
 నిమ్మ ఊరగాయ
కావలసిన వస్తువులు: నిమ్మకాయలు 1kg, నిమ్మకాయలు 10, ఉప్పు 250gm, పచ్చళ్ళ కారంపొడి 125gm , జీలకర్ర పొడి 1tbsp మెంతిపొడి 1tsp పసుపు 25 gm, నూనె 250 gm
         ముందుగా నిమ్మకాయలు కోసి ఒక కిలో తూకం చేసి పెట్టుకోవాలి. ఇలా తూకంతో పెట్టుకుంటే ఊరగాయ పాడవుతుందనే బెంగ ఉండదు. కొలతలన్ని సరిగ్గా ఉంటాయి. ఈ ముక్కలలో పసుపు, ఉప్పు మిగతా నిమ్మకాయలతో తీసిన రసం అందులో వేసి బాగ కలిపి మూతపెట్టాలి. అలా ఓ వారం ముక్కలన్ని ఊరిన తర్వాత పోపు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచం కొంచం తీసి పోపు చేసుకు0టే ఊరగాయ రుచిగా ఎర్రగా ఉంటుంది. నూనె కాచి అందులో కాస్త ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి చిటపటలాదాకా దింపి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కారం, జీలకర్ర, మెంతిపొడి కలిపి ఈ నిమ్మ ముక్కల మిశ్రమాన్ని వేసి కలపాలి. అంతే.

వంకాయ మెంతికూరతో

వంకాయలు 250 gm  ఉల్లిపాయ 1  పచ్చిమిర్చి 5  మెంతికూర అరకప్పు టొమాటోలు 3  అల్లంవెల్లుల్లి 1 tsp  ఆవాలు 1/2 tsp  జీలకర్ర 1/2 tsp  కరివేపాకు 1 tsp  పసుపు 1/2 tsp  నూనె 3 tbsp

ముందుగా వంకాయలను ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, మెంతికూర సన్నగా తరిగి పెట్టుకోవాలి.
నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలను మెత్తబడేవరకువేయించి పచ్చిమిర్చి,మెంతికూర,పసుపు,అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. వంకాయ ముక్కలు,తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి. చిన్న మంటపై నిదానంగా ఉడకనివ్వాలి.


గుత్తివంకాయ కూర

గుండ్రటి వంకాయలు 250 gm  ఉల్లిపాయలు 100 gm  పచ్చిమిర్చి 2 అల్లం వెల్లుల్లి 1 tsp  కొబ్బరిపొడి 2 tbsp  వేరుశెనగగుళ్ళు 3 tsp  నువ్వులు 2 tsp జీలకర్ర 1 tsp
మెంతులు 1/4 tsp  చింతపండు పులుసు అర కప్పు
      ముందుగా చిన్న గుండ్రటి వంకాయలను తీసుకుని నాలుగు పక్షాలుగా కోసి ఉప్పు వేసిన నీళ్ళలో వేసి ఉంచాలి. రెండు స్పూనుల నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలను మెత్తబడేవరకు వేయించి ఉంచుకోవాలి. వేరుశెనగగుళ్ళు, నువ్వులు, జీలకర్ర, మెంతులు కొద్దిగా వేయించి కొబ్బరిపొడితో కలిపి పొడి చేసుకుని అందులో చింతపండు పులుసు, వేయించిన ఉల్లిపాయలు, ఉప్పు,కారం,పసుపు,అల్లం వెల్లుల్లి కలిపి ముద్దగా నూరిపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో వంకాయను తీసుకుని ఈ మసాలా ముద్దను కొద్దిగా అందులో కూరి పక్కన పెట్టుకోవాలి. నూనె వేడి చేసి అర స్పూను జీలకర్ర,మెంతులు వేసి ఎర్రబడ్డాక ఈమసాలా కూరిన వంకాయలను నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలను వేసి మూతపెట్టాలి. వంకాయలు కాస్త మెత్తబడ్డాక మిగిలిన మసాలా ముద్దలో కప్పుడు నీళ్ళు కలిపి పలుచగా చేసి అందులో పోయాలి.ఈ కూరను నిదానంగా ఉడకనివ్వాలి.నూనె తేలిన తర్వాత దింపేయాలి.

వంకాయ కూర

వంకాయలు 250 gm  ఉల్లిపాయలు 1  పచ్చిమిర్చి 6-8
కొత్తిమిర 1/2 కప్పు  అల్లం 2 ‘ ముక్క నూనె 4 tbsp ఆవాలు 1/4 tsp  జీలకర్ర 1/4 tsp  మినపప్పు 1 tsp  సెనగపప్పు 2 tsp
కరివేపాకు 1 tsp  పసుపు 1/2 tsp
       వంకాయలు చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు వేసిన నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ,పచ్చిమిర్చి కూడాసన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం, కొత్తిమిర కలిపి నూరిపెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర, మినపప్పు,సెనగపప్పు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొద్దిగా ఎర్రబడిన తర్వాత నూరినముద్ద,కరివేపాకు వేసి కొద్దిగా వేపి వంకాయ ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. చిన్న మంటపై నీళ్ళు పోయకుండానె ఉడికిపోతుంది.
క్యాలీఫ్లవర్ పికిల్
కావలసినవి:
క్యాలీఫ్లవర్ - ఒకటి (మీడియం సైజు)
పచ్చిమిర్చి - మూడు (సన్నగా తరగాలి), నూనె - 200 గ్రా మిరప్పొడి - 150 గ్రా, పసుపు - చిటికెడు, ఆవపిండి - టీ స్పూన్ ఆవ నూనె- టీ స్పూన్, ధనియాల పొడి - టీ స్పూన్ నిమ్మ ఉప్పు - టీ స్పూన్, ఎండుమిర్చి - ఐదు, వెల్లుల్లి - ఐదురేకలు కరివేపాకు - ఒక రెమ్మ, ఉప్పు - తగినంత, జీలకర్ర - చిటికెడు ఆవాలు- చిటికెడు, జీలకర్ర పొడి - అర టీ స్పూన్
మెంతిపొడి - అర టీ స్పూన్
తయారి:
క్యాలీఫ్లవర్‌ను విడదీసి ఉప్పు కలిపిన వేడి నీటిలో ఐదు నిమిషాల సేపు ఉంచి తీయాలి. తర్వాత నీరు పోయేటట్లు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల పువ్వులోపల ఉన్న దుమ్ము వదిలి శుభ్రమవుతుంది. ఇప్పుడు బాణలిలో 50గ్రాముల నూనె పోసి అందులో క్యాలీఫ్లవర్, పచ్చిమిర్చి ముక్కలను వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. వేయించిన ముక్కలను వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసి అందులో మిరప్పొడి, పసుపు, ఆవపిండి, ఆవనూనె, ధనియాల పొడి, ఉప్పు, నిమ్మ ఉప్పు, జీలకర్ర పొడి, మెంతిపిండి వేసి బాగా కలపాలి.
పోపు:
బాణలిలో 150 గ్రాముల నూనె వేసి అందులో వెల్లుల్లి రేకలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత దించాలి. నూనె చల్లారిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్లో వేసి కలిపితే క్యాలీఫ్లవర్ పికిల్ రెడీ.
మటన్ పికిల్
కావలసినవి:
మటన్ - పావు కిలో మిరప్పొడి - 150 గ్రా
పసుపు - చిటికెడు ఆవపిండి - టీ స్పూన్
జీలకర్ర పొడి - టీ స్పూన్ మెంతిపిండి - టీ స్పూన్ ధనియాల పొడి - టీ స్పూన్
ఆమ్‌చూర్ పౌడర్- టీ స్పూన్ ఉప్పు - తగినంత
పోపు కోసం:
నూనె - 200 గ్రా ఎండుమిర్చి - రెండు సీమ మిరపకాయలు - ఆరు
వెల్లుల్లి - ఐదు రేకలు కరివేపాకు - ఒక రెమ్మ జీలకర్ర - చిటికెడు, ఆవాలు - చిటికెడు
తయారి:
మటన్‌ను చిన్న ముక్కలు చేసి ఉప్పు, పసుపు వేసి ఉడికించి, ఆ ముక్కల్ని ఒక రోజంతా ఎండబెట్టాలి. మరుసటి రోజు ఆ ముక్కలకు మసాలా పొడులను పట్టించాలి. ఆ తర్వాత పోపు పెట్టి చల్లారిన తర్వాత దానిని మసాలా పట్టించిన మటన్ ముక్కలలో వేసి కలపాలి.
మిక్స్‌డ్ వెజ్ పికిల్
కావలసినవి:
క్యారట్ - 200 గ్రా బీన్స్ - 150 గ్రా, పచ్చిమిర్చి - మూడు నూనె - 200 గ్రా, మిరప్పొడి - 150 గ్రా
పసుపు - చిటికెడు, ఆవపిండి - టీ స్పూన్
ఆవ నూనె- టీ స్పూన్ ధనియాల పొడి -టీ స్పూన్
నిమ్మ ఉప్పు - టీ స్పూన్ ఎండుమిర్చి - ఐదు, వెల్లుల్లి - ఐదు రేకలు
కరివేపాకు - ఒక రెమ్మ, ఉప్పు - తగినంత జీలకర్ర - చిటికెడు, ఆవాలు- చిటికెడు జీలకర్ర పొడి - అర టీ స్పూన్ మెంతిపొడి - అర టీ స్పూన్
తయారి:
క్యారట్, బీన్స్, పచ్చిమిర్చిలను కడిగి చిన్న ముక్కలుగా తరగాలి. బాణలిలో 50గ్రాముల నూనె పోసి అందులో ఈ ముక్కలన్నింటినీ వేసి ఒక మోస్తరుగా వేయించాలి(పచ్చిదనం పోవాలి, కరకరలాడకూడదు). వేయించిన ముక్కలను పెద్ద గిన్నెలో వేసి అందులో మిరప్పొడి, పసుపు, ఆవపిండి, ఆవనూనె, ధనియాల పొడి, ఉప్పు, నిమ్మ ఉప్పు, జీలకర్ర పొడి, మెంతిపిండి వేసి బాగా కలపాలి.
పోపు:
బాణలిలో 150 గ్రాముల నూనె వేసి అందులో వెల్లుల్లి రేకలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత దించాలి. నూనె చల్లారిన తర్వాత కూరగాయల ముక్కల్లో వేసి కలిపితే మిక్స్‌డ్ వెజిటబుల్ పికిల్ రెడీ.
దొండకాయ పచ్చడి
కావలసినవి:
దొండకాయలు - అరకేజీ
మిగిలినవన్నీ మిక్స్‌డ్ వెజిటబుల్ పికిల్‌కు తీసుకున్నట్లే దీనికి కూడ. నిమ్మ ఉప్పుకు బదులుగా ఆమ్‌చూర్ పౌడర్ వేసుకోవాలి.
తయారి:
దొండకాయలను కావలసిన సైజులో ముక్కలు తరిగి నూనెలో వేయించాలి. ఆ తర్వాత మిక్స్‌డ్ వెజ్ పికిల్‌కు వేసుకున్నట్లే యథావిథిగా మిగిలిన మసాలా పొడులు, దినుసులను వేసి కలుపుకుని పోపు పెట్టాలి.
మిర్చి - పల్లీ పచ్చడి
కావలసినవి:
వేరుశనగ పప్పు - 250  గ్రానువ్వులు - 100 గ్రా
పచ్చిమిర్చి - 100 గ్రా చింతపండు - 50 గ్రా
ఉప్పు - తగినంత టొమాటో - ఒకటి పసుపు - చిటికెడు జీలకర్ర - 10 గ్రా నూనె - 50 గ్రా వెల్లుల్లి - ఆరు రేకలు
పోపు కోసం: ఎండుమిర్చి - ఐదు
కరివేపాకు - ఒక రెమ్మ

తయారి:
బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత వేరుశనగపప్పు వేసి వేయించాలి. అవి ఒక మోస్తరుగా వేగిన తర్వాత వరుసగా నువ్వులు, పచ్చిమిర్చి, టొమాటో వేసి వేయించాలి. చివరగా జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, పసుపు వేసి దించాలి. పప్పులు చల్లారిన తర్వాత ఉప్పు కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ పచ్చడికి పప్పులు వేయించినప్పుడు మిగిలిన నూనెలో ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాలి.
పచ్చి మామిడికాయ 1 ఎండు మిరపకాయలు 3 ఆవాలు 1/4 tsp జీలకర్ర 1/4 tsp ఇంగువ చిటికెడు పసుపు చిటికెడు  ఉప్పు తగినంత  కరివేపాకు 1 tsp  కొత్తిమిర 2 tsp  చక్కెర 1 tsp  నూనె 3 tsp
               పచ్చి మామిడికాయను ముక్కలుగా కోసి ఉడికించి గుజ్జు తీసుకోవాలి.ఇందులో కావల్సినంత నీరు కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి ఇంగువ వేసి, ఎందుమిరపకాయలు,ఆవాలు, జీలకర్ర వేసి వేగాక మామిడి గుజ్జు కలిపిన నీరు పొసి అందులో పసుపు,ఉప్పు,కరివేపాకు, కొత్తిమిర,చక్కెర వేసి బాగా మరిగించి దింపేయాలి